🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రెసిడెన్షియల్ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ వ్యవస్థను సవరించాలి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 09:12 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో డిప్యూటీ వార్డెన్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఒత్తిడి, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిప్యూటీ వార్డెన్ వ్యవస్థను సమగ్రంగా పునఃసమీక్షించి, తగిన మార్పులు చేయాలని ఉపాధ్యాయ వర్గాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విద్యార్థులకు తరగతి గదుల్లో నాణ్యమైన విద్యను బోధిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను.. హాస్టల్ సరుకుల నిర్వహణ, స్టోర్ రూమ్‌ల పర్యవేక్షణ, రికార్డుల లెక్కలకే పరిమితం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తిస్థాయి బాధ్యతలతో సరైన సమయానికి ఇళ్లకు వెళ్లలేక, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు బోధనపై పూర్తి దృష్టి పెట్టలేక విద్యార్థుల ఫలితాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అదనపు భారాన్ని తొలగించి, హాస్టల్ నిర్వహణకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి కేర్ టేకర్లను లేదా వార్డెన్లను నియమించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్