రంగారెడ్డి,సెప్టెంబర్ 28: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణకుమారి ఆదేశాల మేరకు శివరాంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోమవారం డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan (నషా ముక్త్ యువ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్) ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యసనాల వల్ల ఎలా మారాల్సి వస్తుందో, ఫ్లెక్సీలు మరియు ఆడియో ద్వారా అవగాహన కల్పించి చెప్పడం అలాగే విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.కార్యక్రమం తరువాత ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఐవో డా.షీబా నాయక్,ప్రిన్సిపాల్ భూక్యా నాయక్, పీహెచ్ సి. ఎం.ఓ డా. నిఖిల్,సిబ్బంది పాల్గొన్నారు.
శివరాంపల్లి జడ్పీ హైస్కూల్‌లో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన సదస్సు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





