🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

దళిత జర్నలిస్టుల 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 06:39 PM

అందోల్ (ప్రజానేస్తం ప్రతినిధి, సెప్టెంబర్ 27): తెలంగాణ దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మెదక్/సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో మహాసభల గోడపత్రికను (పోస్టర్) గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల గళాన్ని వినిపిస్తూ జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న దళిత జర్నలిస్టుల సమస్యలు, వారి హక్కుల సాధన, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి తదితర కీలక అంశాలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక వార్తా ప్రసారానికి దళిత జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ 11వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అల్మాయిపేట్ గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు బేగరి దుర్గాప్రసాద్, చందంపేట నరసింహులు, తెనుగు రాజయ్య, రవీందర్ రెడ్డి, రాయిని అనిల్, అమ్రాది మహేష్, తెనుగు అనిల్, సత్యనారాయణ గౌడ్, కమ్మరి సాయి, చాకలి మల్లేశం, కమ్మరి ప్రభు, పన్యాల నర్సింలు, పన్యాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్