🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

టేక్మాల్–ఎల్లుపేట రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి: బీజేపీ డిమాండ్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 05:58 PM

టేక్మాల్: టేక్మాల్ నుంచి ఎల్లుపేటకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు గత కొంతకాలంగా నత్తనడకన సాగుతుండటంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కంకర పోసి పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ లేబర్ సెల్ కన్వీనర్ నాయికోటి శ్యామయ్య మాట్లాడుతూ… కంకర తేలిన రోడ్డు కారణంగా తీవ్రమైన దుమ్ము, ధూళి లేచి ప్రమాదాలు సంభవించే ముప్పు పొంచి ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగులకు రాకపోకలు నరకంగా మారాయని తెలిపారు. అలాగే ఈ మార్గంలో నిత్యం సాగే వాణిజ్య, వ్యాపార రవాణా కూడా తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంకెంతమాత్రం తాత్సారం చేయకుండా టేక్మాల్–ఎల్లుపేట ప్రధాన రహదారి బీటీ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధిరాములు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, బీజేవైఎం మాజీ సెక్రటరీ మదన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్