🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: జాతీయ బీసీ సేన

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 26 Sep 2026 | ⏰ 03:59 PM

రంగారెడ్డి,సెప్టెంబర్ 26: భూమి కోసం… భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు జాతీయ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట జయ శ్రీకాంత్.  చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం జాతీయ బీసీ సేన ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.ఐలమ్మ విగ్రహానికి జాతీయ బీసీ సేన నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.ఈ సందర్భంగా జాతీయ బీసీ సేన నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.నాటి సామాజిక, ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఐలమ్మ, తనపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా పోరాడటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు.రోకలి బండను చేతబట్టి నాటి దొరల ఆధిపత్యాన్ని, రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొన్న ఐలమ్మ ధైర్యసాహసాలు తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.మహిళలు కూడా సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడగలరని చాటిచెప్పిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు.అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని,ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాతీయ బీసీ సేన నాయకులు పేర్కొన్నారు.సమాజంలో సమానత్వం,సామాజిక న్యాయం,ఆత్మగౌరవం కోసం కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట జయ శ్రీకాంత్, చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్ గౌడ్,కోర్ కమిటీ సభ్యుడు చేన్న బాలరాజు,షాద్ నగర్ టౌన్ అధ్యక్షరాలు సరస్వతి,అధ్యక్షురాలు పద్మ, పట్టణ 18 వార్డు అధ్యక్షురాలు చిట్టి,సొమ్య,ప్యాట శ్రీకాంత్ రాజ్ బీసీ సేన ప్రతినిధులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్