శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మను కొలిస్తే సకల శుభాలు
దుర్గమ్మను దర్శించుకున్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 11: దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి దంపతులు ఏబీ విల్లాస్ లో కొలువుదీరిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి పండుగ పురస్కరించుకొని కాలనీలో ఏర్పాటు చేసిన దేవి శరణనవరాత్రి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ..దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని,ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అందె బాబాయ్య, కౌన్సిలర్ రఘునాథ్ యాదవ్, మాజీ కౌన్సిలర్ కానుగు అనంతయ్య, సీనియర్ నాయకులు రాయికల్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు చక్కటి వెంకటేష్ యాదవ్, తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి, కాట్నా రవీందర్, అశోక్ రెడ్డి, ఉమా ప్రవీణ్ రెడ్డి, నాయకులు జ్ఞానేశ్వర్, మనోహర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, అందె రాజేందర్, శివ చారి, అన్వారీ రాజు, మహిపాల్ గౌడ్, శివ, తదితరులు పాల్గొన్నారు.






