🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాలయ్యకు శుభాకాంక్షలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 24 Sep 2026 | ⏰ 09:13 PM

టేక్మాల్, సెప్టెంబర్ 24 (ప్రజానేస్తం న్యూస్): తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ చైర్మన్ బాలయ్య నియమితులయ్యారు. ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం టేక్మాల్ మండల ఇన్‌ఛార్జ్ బొబ్బిలి సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బాలయ్యపై నమ్మకంతో పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బొబ్బిలి సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులైన ప్రతి యువకుడికి ఉపాధి కల్పించి, నిరుద్యోగం లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్