జోగిపేట, సెప్టెంబర్ 24 (ప్రజానేస్తం డిజిటల్ న్యూస్): ఆందోల్–జోగిపేట పురపాలక సంఘం పరిధిలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు సూర్యవంశీ ఆరెకటిక యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథుని సన్నిధిలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), మాజీ కౌన్సిలర్ అల్లే శ్రీకాంత్, నాయకుడు జలగిరి యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. గణేష్ నవరాత్రుల వేళ ఇలాంటి సేవా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మల్లేశం, శంకర్, లక్ష్మణ్, శేఖర్, నాగేష్, రాము, దుర్గేష్, రమేష్, సాయి, నర్సింగ్ తదితరులతో పాటు ఆరెకటిక సంఘం సభ్యులు, వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు
సూర్యవంశీ ఆరెకటిక యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



