🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గీతా హైస్కూల్ విద్యార్థుల ఎంపిక

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 23 Sep 2026 | ⏰ 06:26 PM

మెదక్, ప్రజానేస్తం ప్రతినిధి : కబడ్డీ క్రీడలో మెదక్ మండలం మంభోజిపల్లిలోని గీతా హైస్కూల్ విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాపన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో సబ్‌జూనియర్ బాలికల విభాగంలో గీతా స్కూల్ విద్యార్థినులు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన అసోసియేషన్ ప్రతినిధులు మెదక్ జిల్లా జట్టుకు ముగ్గురు క్రీడాకారిణులను ఎంపిక చేశారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారిలో 9వ తరగతి విద్యార్థిని ప్రీతి, 8వ తరగతి విద్యార్థినులు నందిత, మెహరీష్ ఉన్నారు. వీరు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్ కే. మాధవి, సెక్రటరీ రామాంజనేయులు, ఇన్‌చార్జులు అనిత, స్టెపిన్, సుగుణాకర్ రావులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) పి. కుమార్, దుర్గేష్, మీనా, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్