🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అల్మాయిపేటలో ఘనంగా గణేష్ నిమజ్జనం: ఆటపాటలతో వైభవంగా సాగిన శోభాయాత్ర

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 23 Sep 2026 | ⏰ 10:16 AM

ఆందోల్ మండలం అల్మాయిపేట గ్రామంలో గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు మంగళవారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న లంబోదరుడికి గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

గ్రామ ప్రజలందరి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం విలసిల్లాలని కోరుతూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన గణేష్ శోభాయాత్ర ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. కళాకారుల నృత్యాలు, యువత ఆటపాటలు, డీజే సౌండ్‌ల నడుమ గ్రామంలోని వీధి వీధినా “గణపతి బప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ” అంటూ భక్తులు చేసిన జయజయధ్వానాలతో గ్రామం మార్మోగింది. మహిళలు, పురుషులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దుర్గాప్రసాద్, ఉప సర్పంచ్ అమృత నర్సింలు, తెనుగు రాజయ్య, బుడ్డొల్ల రవిశంకర్, దండు బీరప్ప, రాయిని బాలయ్య, పొట్టిపల్లి మొగులయ్య, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కమ్మరి ప్రభు, పన్నాల శ్రీశైలం, సాయి, పన్యాల ప్రశాంత్ కుమార్ తదితర గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్