🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కాద్లూర్ తండాలో ఘనంగా వినాయక పూజలు.. ఎస్సై అరవింద్ కుమార్ కు సత్కారం!

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 22 Sep 2026 | ⏰ 06:50 PM

టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూర్ గ్రామ తండాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, గ్రామ ప్రతినిధులు ఎస్సై అరవింద్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో ఎస్సై అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో భక్తిభావంతో పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. గణేష్ నిమజ్జన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలకు తావులేకుండా పోలీసు శాఖకు సహకరించాలని గ్రామస్తులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్తిరి సిద్ధు, ఉపసర్పంచ్ శ్రీహరి, వార్డు సభ్యుడు చంద్రశేఖర్, స్థానిక నాయకులు రంగులాలు, సురేష్, విట్టల్, సురేందర్, నరేష్ చారి తదితరులతో పాటు గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్