సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22 ( ప్రజా నేస్తం) : కొండాపూర్ మండల పిఆర్టీయు-టిఎస్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2026–28 కాలానికి మండల అధ్యక్షుడిగా దామోదర్, ప్రధాన కార్యదర్శిగా సడాకుల లక్ష్మణ్, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా స్వప్న ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం. కిష్టయ్య, మురళీకృష్ణ, శోభా చౌహాన్, రాజ్యలక్ష్మి, కార్యదర్శులుగా నవీన్‌కుమార్, యాదగిరి, మహిళా కార్యదర్శులుగా మహేశ్వరి, పద్మ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
కొండాపూర్ మండల పిఆర్టీయు-టిఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



