🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఏడుపాయల వనదుర్గమ్మను దర్శించుకున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 ఏడుపాయల | 🗓 19 Oct 2026 | ⏰ 07:27 PM

మెదక్, అక్టోబర్ 19: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమార్చనలో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ వనదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాల గౌడ్ గంజి నవీన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్