🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అల్మాయిపేటలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు: ఆరవ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గామాత!

Buchaiah
Buchaiah 📍 అల్మాయిపేట | 🗓 17 Oct 2026 | ⏰ 01:06 PM

ఆందోల్ ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్ద ప్రతిరోజూ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు

నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సందర్భంగా అమ్మవారిని చదువుల తల్లి ‘శ్రీ సరస్వతి దేవి’ అవతారంలో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విశేష పూజా కార్యక్రమంలో ప్రముఖ గ్రామస్తులు తెనుగు నరసింహులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వేదోక్తంగా హోమాలు, అభిషేకాలు

ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచే వేద పండితుల దివ్య మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ దుర్గామాతకు గణపతి పూజ, విశేష పంచామృతాభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు మరియు ప్రత్యేక హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో పునీతమయ్యాయి.

గ్రామస్తులకు నిర్వాహకుల విజ్ఞప్తి

ఈ సందర్భంగా ఆలయ మండప నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జరగబోయే మిగతా పూజా కార్యక్రమాలలో గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం భక్తులకు అన్నదాన, ప్రసాద వితరణ చేపట్టారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Buchaiah
రచయిత గురించి (Author Bio)

Buchaiah

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్