🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మంత్రి దామోదర్ రాజనర్సింహ సొంత నియోజకవర్గంలో అధ్వానంగా రోడ్లు: గొంగ్లూర్–గంగోజీపేట్ మధ్య గుంతలమయం!

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 22 Sep 2026 | ⏰ 07:36 PM

ఆందోల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 22( ప్రజా నేస్తం ) : సంగారెడ్డి నుంచి సింగూర్ వెళ్లే ప్రధాన రహదారి గొంగ్లూర్–గంగోజీపేట్ మధ్యలో గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి అధ్వాన స్థితి కారణంగా ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. తాజాగా ఆదివారం రాత్రి గొంగ్లూర్ గ్రామానికి చెందిన గడ్డమీది శంకరయ్య, ఆయన భార్య రేణుక జోగిపేట నుంచి తిరిగి వస్తుండగా గుంతల కారణంగా ప్రమాదానికి గురయ్యారు. రహదారిపై గుంతలను తప్పించుకునే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా ఒకే వైపు రావడంతో అదుపుతప్పి బైక్‌పై నుంచి పడిపోయిన రేణుక తలకు తీవ్ర గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ ఘటనపై స్పందించిన పుల్కల్ మండల ఎంఆర్‌ఓ, ఎస్‌ఐలు వెంటనే రోడ్డు పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. తాత్కాలికంగా రహదారిపై మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరారు. గొంగ్లూర్–గంగోజీపేట్ మధ్య రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పల్లె కిష్టయ్య, ఆలూరి బ్రహ్మానందరెడ్డి, పుట్టి కిష్టయ్య, పల్లె చంద్ర కిరణ్, గౌండ్ల ముకుంద గౌడ్, సంగళ్ల ప్రవీణ్, ఆరిఫ్, మానయ్య తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్