🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

తడ్కల్‌లో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తడ్కల్ | 🗓 16 Oct 2026 | ⏰ 09:32 PM

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంతో పాటు పరిసర పల్లెల్లో ‘అట్ల బతుకమ్మ’ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. సంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చిన మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది గౌరమ్మను కొలిచారు. బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ప్రకృతితో మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని చాటే గొప్ప పండుగ బతుకమ్మ అని మహిళలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువతులు ఉదయం నుంచే తీరొక్క పూలను సేకరించి, ఆకర్షణీయమైన రీతిలో రంగురంగుల బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళ సంప్రదాయ పట్టువస్త్రాలు ధరించి గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను కొలువుదీర్చి గౌరీదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలంతా వలయాకారంగా చేరి బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ, లయబద్ధంగా అడుగులు వేస్తూ సంప్రదాయ జానపద పాటలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. పూలనే దైవాలుగా భావించి పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని కొనియాడారు. ప్రకృతిలో పూలు అంతర్భాగమని, మానవ జీవితానికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ బంధాన్ని ఈ వేడుకలు చాటిచెబుతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను సజీవంగా అందించవచ్చని తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్