🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మాసాన్‌పల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుక.. దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 మాసాన్‌పల్లి | 🗓 16 Oct 2026 | ⏰ 08:41 PM

కల్హేర్ : కల్హేర్ మండలం మాసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దసరా పండుగ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ సహకారంతో సర్పంచ్ సాయిలు, దిలీప్, పండరి కలిసి దుస్తులను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. పండుగ వేళ కార్మికులకు దసరా కానుకగా దుస్తులు అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం శ్రమిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని ప్రశంసించారు. పండుగ పూట వారి శ్రమను గుర్తించి, వారి కుటుంబాల్లో సంతోషం నింపే ఉద్దేశంతో దసరా కానుకగా నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీ కార్మికులకు పండుగ వేళ ఇలాంటి ప్రోత్సాహకరమైన కానుకలు అందించడం ఎంతో అభినందనీయమని స్థానికులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్