జిల్లేడు చౌదరిగూడ (రంగారెడ్డి) : జిల్లేడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గందె సంతోష్ కుమార్ మరణవార్త తెలిసి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎదిర గ్రామంలోని సంతోష్ కుమార్ స్వగృహానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
సంతోష్ కుమార్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాజి ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్, మాజీ జడ్పీటీసీ బంగారు స్వరూప రాములు, మండల అధ్యక్షులు హఫీజ్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, సర్పంచులు విజయలక్ష్మి దామోదర్ రెడ్డి, మోహన చారి, మాజీ ఎంపీటీసీలు సత్య ప్రమోద్, మాణయ్య స్థానిక ఉపసర్పంచ్ భాస్కర్, మాజీ సర్పంచ్ రాజరామేశ్వర్ రెడ్డి, నాయకులు రెడ్డి నర్సింలు, బసు రామస్వామి, నర్సింలు, శేఖర్, మంగలి అంజి, ఈడిగి నరేష్, చందు గౌడ్, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జహంగీర్, శ్రీను, సత్యం, తదితరులు ఉన్నారు.







