🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

6వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ

జనార్ధన్
జనార్ధన్ 📍 Medak | 🗓 04 Oct 2026 | ⏰ 01:52 PM

మెదక్ అక్టోబర్ 04

మెదక్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు, స్థానిక కౌన్సిలర్ హరిత నర్సింగరావు చేతుల మీదుగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పేద మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తోందని, మహిళల ఆనందంలో భాగస్వామ్యం కావడమే లక్ష్యమని అన్నారు.

స్థానిక కౌన్సిలర్ హరిత నర్సింగరావు మాట్లాడుతూ వార్డులోని అర్హులైన ప్రతి ఒక్క మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకున్నామని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్