కొందుర్గులో జై భీమ్ క్రికెట్ టోర్నమెంట్ సీసన్-6 ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
కొందుర్గు , (రంగారెడ్డి ) : యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికే క్రికెట్ టోర్నమెంట్లు ఎంతో దోహద పడతాయని ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో జైభీమ్ క్రికెట్ టోర్నమెంట్ సీసన్-6 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి మరియు పరస్పర సోదరభావానికి తోడ్పడతాయని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో కొందుర్గ్ మాజి జడ్పీటిసీ రామకృష్ణ, మహదేవ్ పూర్ సర్పంచి అనుష రవిందర్ రెడ్డి, బిఆర్ ఎస్ రాష్ట్ర యువనాయకులు సుందర్, కొందుర్గ్ వార్డు మెంబరు వసూరి, విశ్వనాథ్ పూర్ సర్పంచి సుండు రాములు, ఉత్తరాశి పల్లి డిప్యూటి సర్పంచి అలీం, ఉమ్మెంత్యాల మాజి సర్పంచి నర్సిములు, అయోద్య పూర్ మాజి సర్పంచి గొపాల్ నాయక్, గంగన్న గుడెం మాజి సర్పంచి శేకర్, జనార్థన్ గౌడ్, కొందుర్గ్ రఘనాథ్ గౌడ్, శ్రీరంగ పూర్ గ్రామ కమిటి అధ్యక్షుడు యాదయ్య, బైరంపల్లి శ్రీకంత్, టేకులపల్లి కృష్ణ, తంగెళ్లపల్లి మాజి డిప్యూటి రవిందర్ రెడ్డి, వార్డు మెంబరు ప్రవీణ్, ముత్పూర్ మాజి వార్డు మెంబరు సందీప్, లాలాపేట నవాజ్ రెడ్డి,యువ నాయకులు విజయ్ కుమార్,లక్ష్మణ్ ముదిరాజ్, అనంత రాములు, మురళీధర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, రాజశేకర్, ప్రభాకర్, బుట్ట యదగిరి, జైభీం ప్రీమియం నిర్వాహకులు పాల్గొన్నారు.








