🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

నూతన వధూవరులను ఆశీర్వదించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 చేర్యాల | 🗓 14 Oct 2026 | ⏰ 08:05 PM

కొమురవెల్లి, ప్రతినిధి : కాంగ్రెస్ నాయకులు, చేర్యాల వాసి కాటం సంజీవయ్య తేజ పెద్ద కుమారుడు సాత్విక్, సమీనల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చేర్యాల–సిద్దిపేట ప్రధాన రహదారిపై వెలికట్ట గ్రామంలో ఉన్న పవార్ కన్వెన్షన్ హాల్లో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వివిధ ప్రాంతాల నాయకులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్. చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంజ మల్లేశం, మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు, జనగాం శ్రీకాంత్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్