🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పీఆర్టీయూ-టీఎస్ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలి

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 13 Oct 2026 | ⏰ 04:49 PM

మెదక్ (ప్రజానేస్తం ప్రతినిధి): ఈ నెల 15, 16 తేదీల్లో నల్గొండ పట్టణ కేంద్రంలోని జి.ఎం. గార్డెన్స్‌లో నిర్వహించనున్న పీఆర్టీయూ-టీఎస్ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఉపాధ్యాయులంతా ఏకతాటిపై నిలిచి విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అధ్యక్షుడు సుంకరి కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్య నాయక్ పిలుపునిచ్చారు.

మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశాలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బాధ్యులు, సీనియర్ నాయకులు, మహిళా ఉపాధ్యాయులు, ప్రాథమిక సభ్యులు పెద్ద ఎత్తున హాజరుకావాలని వారు కోరారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశాలు కీలక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ-టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్. మల్లారెడ్డి, మెదక్ మండల ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్, చిన్నశంకరంపేట మండల ప్రధాన కార్యదర్శి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్