మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్
మెదక్ అక్టోబర్ 13 : మెదక్ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడంపై మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు భూపతి రాజ్, షామియుద్దీన్, చెదల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.







