🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రత్న నాయక్ తండాలో ఘనంగా ఆలయ పూజలు: GMR జీఎంఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 నాగల్‌గిద్ద | 🗓 12 Oct 2026 | ⏰ 08:48 PM

నారాయణఖేడ్ : నాగల్‌గిద్ద మండలం రత్న నాయక్ తండాలో గుడి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి GMR జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, BRS బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు GMR ఫౌండేషన్ తరఫున కొంత చందా అందజేశారు.

గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రజలతో మమేకమవుతున్న GMR ఫౌండేషన్ సేవలను స్థానికులు అభినందించారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బిక్కు నాయక్, మాజీ ఎంపీటీసీ విజయ్, BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రహ్లాద్, గణపతి తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్