🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బిమోల్ అకోయిజమ్‌ను బర్తరఫ్ చేయాలి

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 12 Oct 2026 | ⏰ 07:58 PM

మెదక్: అక్టోబర్ 12 : మణిపూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్‌ చేసింది. సోమవారం మెదక్‌ శివాజీ చౌక్‌లో బిమోల్‌ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక మాట్లాడుతూ.. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిమోల్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్‌ మల్లేష్‌ గౌడ్‌, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్‌, పబ్బా రాజమణి, శైలజ గౌడ్‌, లావణ్య, సౌజన్య, మమత, రాణి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్