మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామంలో దుర్గమ్మ దేవి ఆగమనం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. అమ్మవారికి గ్రామంలోకి స్వాగతం పలికేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళహారతులు పట్టి, భక్తిపాటలు పాడుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి రాకతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హారతులతో అమ్మవారికి స్వాగతం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




