బెల్లంపల్లి: పట్టణంలోని 5వ వార్డులో ఉన్న కోదండ రామాలయాన్ని తొలగించేందుకు సింగరేణి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని వార్డు కౌన్సిలర్‌తో పాటు బీఆర్ఎస్‌కు చెందిన 14 మంది కౌన్సిలర్లు, బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాన్ని తొలగించే ప్రయత్నాలను అధికారులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకోకపోతే, ఆలయ పరిరక్షణ కోసం బస్తీ వాసులతో కలిసి నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్లు, స్థానికులు హెచ్చరించారు. ప్రజల మనోభావాలను గౌరవించి, కోదండ రామాలయాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కోదండ రామాలయాన్ని తొలగించే ప్రయత్నాలు విరమించాలి

NARESH SAMARLA
📍 బెల్లంపల్లి (మంచిర్యాల | 🗓 11 Oct 2026 | ⏰ 05:09 PM

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:

రచయిత గురించి (Author Bio)
NARESH SAMARLA
ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.





