కౌడిపల్లి (ప్రజానేస్తం ప్రతినిధి): ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ముత్రాజ్పల్లిలో పాలీహౌస్ కీరాదోస సాగు, ఆయిల్ పామ్ తోటలను ఆమె పరిశీలించారు. యువ రైతులు ఆధునిక సాగు పద్ధతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ తోటలో పరాగ సంపర్క పురుగులను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





