రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ లో జాగృతి కార్యాలయం లో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే ఒక స్వచంద సేవా సంస్థ అని ఆమె అన్నారు. బతుకమ్మ పండుగను దాని విశిష్టత మరుగున పడకుండా ప్రపంచానికి చాటి చెప్పాలి అనే సంకల్పంతో జాగృతి ని స్థాపించడం జరిగిందని అన్నారు.
జిల్లా అధ్యక్షులుగా నా పై నమ్మకంతో నియమించినందుకు జాగృతి రాష్ట్ర కార్యాలయం లో కవితను కలిసి బొకే ఇచ్చి శాలువతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కవితకు రాష్ట్ర అధ్యక్షురాలు మాదవి లకు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. జాగృతి సంస్థ యొక్క ఆశయాల కోసం బాధ్యతగా పని చేస్తా అని జిల్లా అధ్యక్షులు మొయినుద్దీన్ అన్నారు.







