మెదక్, అక్టోబర్ 5: మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ లక్ష్మి పాల్గొన్నారు. ప్రాజెక్టు సీడీపీఓ వెంకటరమణ, మాచవరం సెక్టార్ సూపర్‌వైజర్ రమ, పాతూర్ సెక్టార్ సూపర్‌వైజర్ మాధవితో పాటు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సీడీపీఓ వెంకటరమణ మాట్లాడుతూ పోషకాహారం ప్రాధాన్యత, సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవగాహన

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






