🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఉద్యోగ విరమణ.. ప్రజా సేవకు విరామం కాదు తెలంగాణ ఉద్యమంలో జెల్ల సుధాకర్‌ పాత్ర అభినందనీయం: పద్మా దేవేందర్‌రెడ్డి

జనార్ధన్
జనార్ధన్ 📍 Medak | 🗓 04 Oct 2026 | ⏰ 06:00 PM

మెదక్‌, అక్టోబర్‌ 4: ఉద్యోగ విరమణ బాధ్యతలకు మాత్రమేనని.. ప్రజా సేవకు కాదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న జెల్ల సుధాకర్‌ను అభినందించారు. ఉద్యోగుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. మెదక్‌లోని మంజీరా గార్డెన్‌లో జరిగిన అభినందన సభలో పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాల్లో సుధాకర్‌ పాల్గొని ప్రజలను చైతన్యపరిచారని గుర్తుచేశారు. పదవీ విరమణ అనంతరం తన అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ ఉద్యోగ బాధ్యతలకు ముగింపు మాత్రమేనని, సమాజం పట్ల బాధ్యతలకు కాదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, దీపక్‌కుమార్‌, సోహెల్‌, మాజీ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్‌, మాయ మల్లేశం, నాయకులు జీవన్‌రావు, కృష్ణగౌడ్‌, లింగారెడ్డి, సాదిక్‌, షాకీర్‌, కిరణ్‌, ఎంబీపూర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్