టేక్మాల్: టేక్మాల్ మండల సీనియర్ నాయకులు శ్రీధరచారి మాతృమూర్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి వెంటనే వారి నివాసానికి చేరుకున్నారు. మృతురాలి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీధరచారితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మఠం భిక్షపతి వెంట పలువురు మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.
శ్రీధరచారి మాతృమూర్తి మృతికి మఠం భిక్షపతి నివాళులు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





