🗓 శనివారం 24 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీకి టీఎన్‌టీయూసీ ఏకగ్రీవ నిర్ణయం

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి | 🗓 24 Oct 2026 | ⏰ 10:52 PM

బెల్లంపల్లి :
బెల్లంపల్లి రాబోయే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టీఎన్‌టీయూసీ) తరఫున పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, జ్యోత్స్న మేడం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కె. బోస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు, కార్మిక సంఘాల పనితీరు, కార్మికుల సమస్యలు, సింగరేణి సంస్థ భవిష్యత్తు, రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంపై నాయకులు అభిప్రాయాలు వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తి నుంచి సంస్థ నిర్వహణ వరకు కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
కార్మిక సమస్యల పరిష్కారానికి కార్మిక బాట
సింగరేణి సంస్థ పరిరక్షణ, కొత్త గనుల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాలు, సొంత ఇంటి పథకం, మారుపేర్ల సమస్య, 12వ వేతన ఒప్పందానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించారు. ఈ సమస్యలపై కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు త్వరలోనే సింగరేణి పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో కార్మిక బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఎన్‌టీయూసీ ముందుకు సాగాలని సమావేశం తీర్మానించింది.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో ఎస్‌సీఎల్‌యూ టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి టి. మణిరామ్ సింగ్, ఏబీఎన్ మోహన్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్దెల నారాయణ, ఎస్‌సీఎల్‌యూ ఉపాధ్యక్షుడు బొల్లు మల్లయ్య, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజర్ కొండి శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంట్ ప్రచార కార్యదర్శి గజ్జె దుర్గయ్య, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు మధునయ్య, దండే సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్