హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును ఆయన నివాసంలో తెలంగాణ బిఆర్ఎస్ మైనార్టీ నేతల ప్రతినిధి బృందం టేక్మాల్ మాజీ జడ్పీటీసీ ముక్తార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 3వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నేతలు హరీష్ రావుకు ముందస్తుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించే చాదర్‌ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ ప్రతినిధి బృందం త్వరలోనే రాజస్థాన్‌లోని ప్రసిద్ధ అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించి, హరీష్ రావు జన్మదినం సందర్భంగా అక్కడ ఈ చాదర్‌ను సమర్పించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో శాంతి, సామరస్యం వర్ధిల్లాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, సంపదలతో విలసిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు నేతలు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో మైనార్టీ నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొని హరీష్ రావుకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీ నేతల అప్యాయతకు, శుభాకాంక్షలకు హరీష్ రావు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, సిద్దిపేట నాయకులు జమ్ము ఖాన్, జహీరాబాద్ ఇన్‌చార్జ్ షేక్ ఫరీద్, సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ హకీం, అక్బర్, మెరాజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.