మెదక్, అక్టోబర్ 8: మెదక్ పట్టణంలోని బంగ్లా చెరువు వద్ద బతుకమ్మ పండుగను పురస్కరించుకుని చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మహిళలకు అవసరమైన ఇతర మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు.
బతుకమ్మ వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పండుగలో పాల్గొనే మహిళలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నవీన్, కో-ఆప్షన్ సభ్యులు తాహెర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.







