🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కొమురవెల్లి | 🗓 14 Oct 2026 | ⏰ 07:50 PM

కొమురవెల్లి ప్రతినిధి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయాన్ని తెలంగాణ శాసన మండలి సభ్యులు (MLC), ప్రొఫెసర్ శ్రీ కోదండరాం బుధవారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు సాదరంగా ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు.

అనంతరం ప్రొఫెసర్ కోదండరాం తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి గర్భాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు, అర్చకులు వారి పేరిట సంకల్పం చేసి, మల్లికార్జున స్వామి వారికి అభిషేకాలు, విశేష అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొమురవెల్లి మల్లన్న కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు స్వామివారిని ప్రార్థించారు.

దర్శనానంతరం ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్‌తో పాటు ఇతర అర్చకులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం దంపతులకు, కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి శేష వస్త్రాలను కప్పి, పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. ప్రముఖ నాయకులు, మేధావి అయిన ప్రొఫెసర్ కోదండరాం ఆలయానికి రావడంపై స్థానిక భక్తులు ఆసక్తి చూపారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్‌లతో పాటు పలువురు ఆలయ సిబ్బంది, అర్చక బృందం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కుటుంబ సభ్యుల పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్