🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కొమురవెల్లిలో వైభవంగా శ్రీదేవి త్రిరాత్రి మహోత్సవాలు – భక్తిశ్రద్ధలతో చండీ మహాహోమం, పూర్ణాహుతి

sevith
sevith 📍 కొమురవెల్లి | 🗓 19 Oct 2026 | ⏰ 07:07 PM

కొమురవెల్లి, అక్టోబర్, 19 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి త్రిరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

మహార్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ గర్భాలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం, క్షేత్రపాలక భైరవ ఆరాధనలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాగణపతి పూజ, శ్రీగౌరీ పూజ, దీప పూజ, జగద్గురు పంచాచార్య ఆరాధన, బ్రహ్మాది పంచపాలికా దేవతా ఆరాధన, ఆదిత్యాది నవగ్రహ దేవతా పూజలు, అష్టదిక్పాలక ఆరాధనలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.

ఈ సందర్భంగా అమ్మవారిని ‘శ్రీ మహాకాళి’ అవతారంలో విశేషంగా అలంకరించి, చతుషష్టి ఉపచార మహా పూజ, ఖడ్గమాలార్చనలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య మహాగణపతి హోమం, ఆవాహిత మండప దేవతా హోమం, చండీ మహాహోమం, మూలమంత్ర హోమం, జయాది హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. దిక్పాలక బలి, క్షేత్రపాలక బలి సమర్పించిన అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞేశ్వర స్వరూపంలో కొలువైన శ్రీ చండికా పరమేశ్వరికి పట్టువస్త్రాలు, హరిద్రా కుంకుమాది విశేష సుగంధ ద్రవ్యాలను సమర్పించి, మహా మంగళహారతి, మంత్రపుష్పం సమర్పించారు.

సాయంత్రం వేళ పునః మండపారాధన నిర్వహించి, శ్రీదేవికి చతుషష్టి ఉపచార మహా పూజతో పాటు కుమారి పూజ, సుహాసిని పూజలను భక్తిశ్రద్ధలతో జరిపించారు. చివరగా అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
sevith
రచయిత గురించి (Author Bio)

sevith

జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్