మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా మోహన్ నాయక్
సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యునిగా వడ్డె రాములు
టేక్మాల్: టేక్మాల్ మండలానికి చెందిన బీజేపీ నాయకులకు ఉమ్మడి జిల్లాలో పార్టీ పరంగా కీలక బాధ్యతలు దక్కాయి. మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా మోహన్ నాయక్, సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా వడ్డే రాములు నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మోహన్ నాయక్, వడ్డె రాములును మెదక్ జిల్లా లేబర్ సెల్ కన్వీనర్ నాయికోటి శ్యామయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయికోటి శ్యామయ్య మాట్లాడుతూ టేక్మాల్ మండలానికి చెందిన నాయకులకు ఉమ్మడి జిల్లాలో పార్టీ పరంగా బాధ్యతలు రావడం సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, మండలంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
నూతనంగా నియమితులైన మోహన్ నాయక్, వడ్డే రాములు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తామని చెప్పారు. టేక్మాల్ మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. మోహన్ నాయక్ ఎస్టీ మోర్చా ద్వారా గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, వడ్డే రాములు రైతులకు సంబంధించిన సమస్యలను పార్టీ వేదికల ద్వారా ప్రస్తావిస్తూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన బాధ్యతలు పొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా లేబర్ కన్వీనర్ నాయికోటి శామయ్య, ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు సిద్ధి రాములు, టేక్మల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శంకర్, బీజేవైఎం జిల్లా సెక్రెటరీ మదన్ రెడ్డి,
మండల్ జనరల్ సెక్రెటరీ సేనపతి, జనరల్ సెక్రెటరీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






