మెదక్, అక్టోబర్ 2: ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి.. మెదక్ పట్టణంలోని నవాపేట్‌లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. నవాపేట్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు తుమ్మ లక్ష్మీనారాయణ తల్లి రాజమణి, రెడ్డిపల్లికి చెందిన సంజీవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్ సోదరుడు దేవి ప్రసాద్ దశదిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఆపద సమయంలో తోడుగా నిలుస్తామని తిరుపతిరెడ్డి తెలిపారు. కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు చంద్రమోహన్‌గౌడ్, తలారి సంతోష్, నయుముద్దీన్, జగదీష్, కిరణ్‌గౌడ్, నాగరాజు, గంజి నవీన్, బాపురెడ్డి, మెకానిక్ రాజు, బి.ఎన్.రెడ్డి, మంబోజిపల్లి మాజీ సర్పంచ్ గంజి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.







