🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన విద్య అందేలా చూడాలి : అదనపు కలెక్టర్ డాక్టర్ కె.కిరణ్మయి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 30 Sep 2026 | ⏰ 07:03 PM

రంగారెడ్డి జిల్లా,సెప్టెంబర్ 30: అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం,మెరుగైన విద్యా అందేలా చూడాలని సూచించారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కె.కిరణ్మయి… బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ కె.కిరణ్మయి బుధవారం సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, హాజరు, ప్రీ-స్కూల్ విద్య, కేంద్రం నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన విద్య అందేలా చూడాలి

అనంతరం ఎంపీపీస్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, బోధనా విధానం, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పీహెచ్ లో వైద్య సేవలు, సిబ్బంది హాజరు,మందుల లభ్యత, రోగులకు అందుతున్న సేవలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో, సమర్థవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి సూచించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్