🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బీ దుబార్‌పేట్ గ్రామస్తులు తెలంగాణ రక్షణ సేన (TRS)లో చేరిక

Abhinay
Abhinay 📍 ఇచ్చోడ | 🗓 19 Oct 2026 | ⏰ 06:58 PM

ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడ మండలం బీ దుబార్‌పేట్ గ్రామానికి చెందిన గ్రామస్తులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వీడి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో స్వచ్ఛందంగా చేరారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క ప్రవేశపెట్టిన ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, సామాజిక న్యాయ పథకాలకు ఆకర్షితులై గ్రామస్తులంతా ఏకతాటిపై పార్టీలో చేరారని పేర్కొన్నారు. బీ దుబార్‌పేట్ గ్రామాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగుతోందని, పార్టీ విధానాలను, ఆశయాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ భిలాల్ బాయ్, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Abhinay
రచయిత గురించి (Author Bio)

Abhinay

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్