ఆమనగల్లు : దసరా పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని ఆమనగల్లు పట్టణంలో పండుగ శోభ సంతరించుకుంది. ఉత్సవ నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆదివారం దగ్గరుండి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చేపడుతున్న విద్యుత్ దీపాలంకరణలు, ఉత్సవ వేదికల సిద్ధత, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతుల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేలా చూడాలని కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నరసింహ, మున్సిపల్ కౌన్సిలర్లు సునీత ప్రశాంత్ నాయక్, ఎర్రవోలు మహేష్, కో-ఆప్షన్ సభ్యులు చుక్క అలాజీ, మాజీ కౌన్సిలర్లు దివ్య శ్రీకాంత్ సింగ్, చెన్నకేశవులు, దుడ్డు కృష్ణ యాదవ్ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








