🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సొసైటీలకు నామినేట్ వద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలే ముద్దు: టేక్మాల్ పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 మెదక్, టేక్మాల్ | 🗓 29 Sep 2026 | ⏰ 07:59 PM

టేక్మాల్: రైతుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నడిచే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించే ఆలోచనను విరమించుకుని, వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని టేక్మాల్ పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. మంగళవారం టేక్మాల్ సొసైటీ ఆవరణలో మహాజన సభ సమావేశాన్ని అజెండాలతో నిర్వహించారు. ఈ సమావేశంలో సొసైటీ ఆర్థిక పురోగతి, రైతులకు రుణాల పంపిణీ, పరిపాలనాపరమైన సంస్కరణలపై పలు ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించారు.

సొసైటీ పరిధిలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన పాత రుణాల రికవరీ సక్రమంగా జరగకపోవడంతో, కొత్తగా రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమావేశంలో చర్చించారు. రైతులందరికీ సమష్టిగా ప్రయోజనం చేకూరాలంటే మొండి బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని, రుణాల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయాలని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

సొసైటీకి ఆదాయ వనరులను సమకూర్చే పెట్రోల్ బంకు నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు లీజుకు ఇచ్చేందుకు తీర్మానించారు. అలాగే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గత రెండేళ్లుగా విధులకు గైర్హాజరవుతూ సంస్థ పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సభలో తీర్మానించారు. వీటితో పాటు సొసైటీ వ్యాపార కార్యకలాపాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

సొసైటీలకు నామినేట్ వద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలే ముద్దు: టేక్మాల్ పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి

సమావేశానంతరం చైర్మన్ యశ్వంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై చేసిన అవినీతి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించిన సమగ్ర విచారణలోనే తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని రుజువయ్యిందని, ఆ నివేదికే తన నిజాయితీకి ప్రత్యక్ష నిదర్శనమని గుర్తుచేశారు.

“సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం పని చేసే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు తప్ప.. పార్టీల రాజకీయ పునరావాస కేంద్రాలు కావు” అని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా సొసైటీలో సభ్యత్వం కలిగి, వాటాధనంతో భాగస్వాములైన రైతులకు మాత్రమే తమ పాలకవర్గాన్ని ఎన్నుకునే పూర్తి హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిని పక్కనపెట్టి, షెడ్యూల్ ప్రకారం పూర్తి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలన్నారు.

ఈ సర్వసభ్య సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకయ్య, పాలకవర్గ డైరెక్టర్లు కిషన్, శ్రీరాములు, శ్రీశైలం, సొసైటీ సీఈవో సాయిలు, వేణుగోపాల్‌తో పాటు పలు గ్రామాల రైతులు, సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్