మెదక్ సెప్టెంబర్ 27 : భారతీయ జనతా యువ మోర్చా(బిజేవైఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి గా మెదక్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు రామస్వామి సాయిబాబా గౌడ్ ను నియమిస్తూ ఆదివారం బిజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను వెంటనే విడుదల చేయాలని అయన డిమాండ్ చేశారు. తనకు వచ్చిన పదవితో మరింత బాధ్యత పెరిగిందిన్నారు.తన ఎన్నికకు కృషిచేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కొండి గణేష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
బిజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఆర్. సాయిబాబా గౌడ్

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





