🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సమసమాజ స్థాపనే భగత్ సింగ్ ఆశయం: AIUKS, PYL నేతల పిలుపు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 26 Sep 2026 | ⏰ 05:59 PM

సిరికొండ, సెప్టెంబర్ 26: అన్యాయాన్ని ఎదిరించి, దోపిడీలేని సమసమాజం కోసం పోరాడటమే షహీద్ భగత్ సింగ్ ఆశయమని, ఆయన ఆశయ సాధనకు నేటి యువత నడుం బిగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (AIUKS) జిల్లా ప్రధాన కార్యదర్శి బి. బాబన్న పిలుపునిచ్చారు. భగత్ సింగ్ జయంతి వారోత్సవాల సందర్భంగా పీవైఎల్ (PYL), పీవోడబ్ల్యూ (POW), పీడీఎస్‌యూ (PDSU) సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కేజీబీవీ (KGBV) పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంకటి ఆశిష్ మాట్లాడుతూ, భగత్ సింగ్ కేవలం బ్రిటిష్ పాలకులను తరిమికొట్టేందుకే కాకుండా, అన్ని రకాల సామాజిక అసమానతలు, అణచివేతలపై గళమెత్తిన అరుదైన విప్లవ యోధుడని కొనియాడారు. యువతలో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, సామాజిక బాధ్యత పెరగాలని ఆయన ఆకాంక్షించారని గుర్తుచేశారు.

నేటి సమాజంలో తీవ్రమవుతున్న నిరుద్యోగం, రైతులు, కార్మికుల సంక్షోభం, ప్రైవేటీకరణతో భారం అవుతున్న విద్య, వైద్య రంగాల సమస్యలపై యువత పోరాట చైతన్యంతో ముందుకు రావాలని ఆయన సూచించారు. భగత్ సింగ్ చూపిన ధైర్యం, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని పీడిత ప్రజల పక్షాన నిలబడటమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల నాయకులు సాయా రెడ్డి, మలికి లింబాద్రి, ఎస్. కిషోర్, పాఠశాల విద్యార్థులు లావణ్య, రజిత, సౌజన్య, మేఘన తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్