నర్సాపూర్ ప్రతినిధి : కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో రజాక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాన్ని, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడిన గొప్ప మహిళా యోధురాలని పేర్కొన్నారు. అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. మహిళలు సామాజిక న్యాయం కోసం ముందుకు రావాలనే సందేశాన్ని చాకలి ఐలమ్మ జీవితం అందిస్తుందని తెలిపారు.
ఆమె ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.చాకలి ఐలమ్మ చరిత్రను, ఆమె పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ గుప్త, మెదక్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రాజేందర్, మాజీ సర్పంచ్ జాజాల ప్రకాష్, కాగిత లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హాజరై చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.






