🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం : కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 26 Sep 2026 | ⏰ 04:13 PM

నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ జి. మల్లేష్ యాదవ్

 

రంగారెడ్డి,సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.శనివారం రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై,ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.ఆమె పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం బలోపేతమైందని, తద్వారా లక్షలాది ఎకరాల భూమి పేద ప్రజలకు పంపిణీ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వంటి మహనీయుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ జి. మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ తన జీవితంలో అనేక కష్టాలను, అణచివేతలను ఎదుర్కొని ప్రజల కోసం పోరాడారని తెలిపారు.పాలకుర్తి ప్రాంతంలో కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తూ, తన పంటను దోపిడీ చేసేందుకు ప్రయత్నించిన దొరల ఎదుట ధైర్యంగా నిలబడి తన హక్కుల కోసం పోరాడిన వీరవనితగా ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మాత్రమే కాకుండా, నేటి తరానికి దిక్సూచిగా నిలిచిన స్ఫూర్తిదాత అని మల్లేష్ యాదవ్ కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తితో యువత తప్పుడు మార్గాలకు దూరంగా ఉండి, సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారుఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శివ ఆశిష్ సింగ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేసు రామ్, రజక సంఘం నాయకులు అజయ్, దశరథ్, శ్రీరాములు, వడ్డెర సంఘం నాయకులు వరికుప్పల సుధాకర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, బీసీ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండ ఆంజనేయులు, బీసీ సంఘం నాయకులు అచ్చన నరసింహ, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్