🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

టేక్మాల్‌లో ఘనంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 05:56 PM

టేక్మాల్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ప్రముఖులు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను టేక్మాల్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం, ఆయన దేశ సేవకు, ప్రజా సంక్షేమానికి అందించిన సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలే భారతీయ జనతా పార్టీకి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు ఫలాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన ఆలోచనల బాటలో ప్రతి కార్యకర్త నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ లేబర్ సెల్ కన్వీనర్ నాయికోటి శ్యామయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధిరాములు, బీజేవైఎం సెక్రటరీ మదన్ రెడ్డి, సెక్రటరీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్