🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రూ. 7.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన: మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ శేషారెడ్డి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 24 Sep 2026 | ⏰ 06:44 PM

అల్లాదుర్గం, సెప్టెంబర్ 24 (ప్రజానేస్తం న్యూస్): రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు అల్లాదుర్గం మండలంలో రూ. 7.20 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రధాన రోడ్డు నిర్మాణ పనులకు వట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మీ శేషారెడ్డి శంకుస్థాపన చేశారు. అల్లాదుర్గం పోచమ్మ గుడి నుండి జగిర్యాల చౌరస్తా (పీడబ్ల్యూడీ రోడ్డు) వరకు నిర్మించనున్న ఈ బీటీ రోడ్డు పనులకు అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల శేషారెడ్డితో కలిసి ఆమె శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ శేషారెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

రూ. 7.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన: మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ శేషారెడ్డి

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రమేష్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం, డీసీసీ జిల్లా కార్యదర్శి బలరాం, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, శశి రెడ్డి, వీరన్న పటేల్, హరికృష్ణ, శంకర్ నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు శేఖర్ పటేల్, బుంరెడ్డి, ప్రభు, బేతయ్య, పాపయ్య, రాజు నాయక్, సాయిలు, మదర్ బాయ్, షరీఫ్, జైపాల్ నాయక్ తదితరులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్