🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఎల్లంపల్లిలో ఘనంగా పండగ సాయన్న జయంతి వేడుకలు

sevith
sevith 📍 ఎల్లంపల్లి | 🗓 22 Oct 2026 | ⏰ 04:37 PM

టేక్మాల్: ముదిరాజ్ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి ప్రతి ఒక్కరూ సంఘటితంగా పనిచేయాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు కంది మాణెయ్య పిలుపునిచ్చారు. పండగ సాయన్న జయంతిని పురస్కరించుకుని గురువారం మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఎల్లంపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

జయంతి వేడుకల సందర్భంగా ఎల్లంపల్లి గ్రామం నుంచి టేక్మాల్ చౌరస్తా మీదుగా పట్టణ పురవీధుల గుండా భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. యువకులు ముదిరాజ్ జెండాలు చేతబూని, డిజే పాటల నడుమ ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ర్యాలీని ముందుకు నడిపించారు. అనంతరం ఎల్లంపల్లిలో సంఘం జెండాను ఆవిష్కరించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన మండల ముదిరాజ్ మహాసభలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ విప్లవ వీరుడు పండగ సాయన్న అని కొనియాడారు. నిజాం పాలన కాలంలో అణచివేతకు గురైన పేద ప్రజల పక్షాన నిలిచి, అన్యాయంగా దోచుకున్న భూస్వాముల సంపదను పేదలకు పంచిపెట్టాడని తెలిపారు. ఆయన్ను ప్రజలు “తెలంగాణ రాబిన్ హుడ్” అని ఆప్యాయంగా పిలుచుకుంటారని పలువురు గుర్తు చేశారు.

నిజాం పరిపాలనలో ప్రజలను వెట్టిచాకిరీ చేయిస్తూ, అధిక పన్నులతో అణచివేసేవారు. ఈ దౌర్జన్యాలు, వివక్షను చూసి చిన్నతనం నుంచే సాయన్నలో తిరుగుబాటు మొదలైందన్నారు. రైతుల కష్టాల్లో తోడుగా ఉంటూ, దొరల అరాచకాల నుంచి గ్రామీణ ప్రజలకు రక్షణగా నిలిచారు. పండుగ రోజుల్లో పేదలకు తిండి, బట్టలు అందేలా చూసేవారని, అందుకే ఆయనకు ‘పండగ’ సాయన్న అనే పేరు మరింత స్థిరపడిందని తెలిపారు.

ఎల్లంపల్లిలో ఘనంగా పండగ సాయన్న జయంతి వేడుకలు

ముదిరాజులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎదగాలని, ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఐక్యత చాటి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ముదిరాజ్ సమాజం సామాజికంగా, ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉందని, ఆదుకోవడానికి రిజర్వేషన్ ఫలాలు పూర్తిస్థాయిలో దక్కాలన్నారు. ఇందులో భాగంగా ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఎ గ్రూపులోకి మార్చాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం, భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం సంఘటితంగా ఉంటూ ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

రాజకీయంగా ఎదగాలని, ఇందుకోసం పార్టీలను పక్కన పెట్టి పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. జనాభాలో 50శాతం ఉన్న ముదిరాజులు పాలన, పదవుల్లో ఏ స్థాయిలో ఉన్నమో అందరూ ఆలోచించుకోవాలన్నారు. 10శాతం లేని వారు అధికారాన్ని చేపడుతుంటే 50 శాతం ఉన్న ముదిరాజులు వారికి ఊడిగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
sevith
రచయిత గురించి (Author Bio)

sevith

జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్